వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

  • ఇటీవల అస్వస్థతకు గురైన వంగవీటి రాధా
  • క్రమంగా కోలుకుంటున్న వైనం
  • నేడు ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం... రాధా ఇంటికి వెళ్లిన లోకేశ్
ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి లోకేశ్.. తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. రాధా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

ఈ క్రమంలో, వంగవీటి రాధా కుటుంబ సభ్యులతోనూ ఆత్మీయంగా ముచ్చటించారు. మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల వంగవీటి రాధా కృతజ్ఞతలు తెలిపారు.

Nara Lokesh
Vangaveeti Radhakrishna
Tadepalli
TDP

More Telugu News